మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా పాజిటవ్ - minister gowtham reddy corona positive updates

12:16 April 23
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో.. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు.
గడిచిన రెండు మూడు రోజులుగా తనను వ్యక్తిగతంగా కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. కరోనా కారణంగా ఇవాళ మైక్రోసాఫ్ట్ సంస్థతో నైపుణ్యాభివృద్ది శిక్షణకు సంబంధించి జరగాల్సిన అవగాహన ఒప్పంద కార్యక్రమం వాయిదా పడింది.
ఇదీ చదవండి:కరోనా పంజా... అడుగంటుతున్న ఆక్సిజన్ నిల్వలు