రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం 50 శాతం నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. దిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుక్ మాండవ్యను కలిసిన ఆయన.. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా తీసుకోవాలని విన్నవించామన్నారు. సాగరమాల పథకంలో ఆగిన ప్రాజెక్టులన్నింటినీ ప్రారంభించేందుకు సహకరించాలని కోరామన్నారు. అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు గౌతంరెడ్డి చెప్పారు.
ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం ఆర్థిక సాయం: గౌతమ్ రెడ్డి
కేంద్ర మంత్రి మన్‌సుక్ మాండవ్యను.. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై కేంద్రమంత్రితో చర్చించామని ఆయన తెలిపారు. 4 ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయం ఉంటుందన్నారు. రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా తీసుకోవాలని కోరినట్లు వివరించారు.
Minister Goutham