ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ హత్య కేసులో మా వాళ్లు తప్పు చేస్తే.. సీబీఐ విచారణ ఎందుకు అడుగుతాం? - బొత్స

మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమన్న ఆయన.. అందుకోసం పోరాడుతున్నామని చెప్పారు.

minister botsa satyanarayana
minister botsa satyanarayana

By

Published : Feb 19, 2022, 3:42 PM IST

Updated : Feb 19, 2022, 5:01 PM IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని.. అందుకోసం పోరాడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భోగాపురం భూసేకరణలో న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వోక్స్‌ వ్యాగన్‌ తప్ప నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్న ఆయన.. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో తన తండ్రి కొంత భూమి కొన్నారని వెల్లడించారు. తప్పుగా అమ్మిస్తే ఎవరిది తప్పు అవుతుందని వ్యాఖ్యానించారు.

ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధం..

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏర్పాటైన ప్ర‌భుత్వాల కంటే ఎక్కువ ఇళ్ల‌ను మంజూరు చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని బొత్స స్పష్టం చేశారు. ఇళ్ల మంజూరుపై తెదేపా నేతల వ్యాఖ్యలు సరికావన్నారు. సంక్షేమం విషయంలో రాజకీయం చేయవద్దని కోరారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ఎక్క‌డికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని మంత్రి ప్ర‌క‌టించారు. విద్యుత్ కోతల విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'క్లాప్' కార్య‌క్ర‌మంలో భాగంగా చెత్త‌పై నామ‌మాత్ర‌పు ప‌న్ను విధించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇది ప్ర‌జ‌ల‌కు పెద్ద భారం కాద‌ని వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే జాబ్ క్యాలండర్​ను విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు.

వివేకా హత్య స్పందించిన బొత్స.. హత్య విషయంలో సీబీఐ విచారణ వేయమన్నామని అడిగామని గుర్తు చేశారు. తమ వాళ్లు తప్పు చేస్తే సీబీఐ విచారణ ఎందుకు అడుగుతామని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 19, 2022, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details