ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో అదే జరుగుతుంది : బొత్స

Minister Botsa: ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మరోవైపు ఆర్​.కృష్ణయ్యను రాజ్యసభకు పంపడంపైనా స్పందించిన బొత్స.. అందులో తప్పేంటని ప్రశ్నించారు.

Minister Botsa
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : May 23, 2022, 4:08 PM IST

Updated : May 23, 2022, 5:32 PM IST

Minister Botsa: ఎమ్మెల్సీ అనంత బాబు విషయంపై పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తర్వాత చూస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న పలు జాతీయ రహదాల పనుల తీరు, భూ సేకరణ, తదితర అంశాలపై మంత్రి బొత్స సత్యనారాయణ... కలెక్టర్ సూర్యకుమారితో చర్చించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

మరోవైపు తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభకు పంపడంపై వస్తున్న విమర్శలపై మంత్రి బొత్స స్పందించారు. బీసీ సంఘానికి జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్యలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపతే తప్పే ఏమిటని అన్నారు. అప్పట్లో సురేష్ ప్రభు, సీతారామన్​కు రాజ్యసభ ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు లేని తప్పు... ప్రతిపక్షాలకు ఇప్పుడే కనిపిస్తోందా..? అని ప్రశ్నించారు. ఎక్కడవారన్నది కాదని... ఎంత సమర్థవంతులో చూడాలని అన్నారు. కృష్ణయ్య ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించారని...అందుకే కృష్ణయ్యకు తమ నాయకుడు రాజ్యసభ సీటిచ్చారని మంత్రి బొత్స వివరించారు. బీసీల విషయంలో తమ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తోందన్నారు. బీసీలకు చేసిన మేలు ప్రజలకి తెలియజెప్పాలనే ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేపడుతున్నామని మంత్రి బొత్స తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 23, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details