ఉపాధి హామీ పథకం కింద గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని(MGNREGS PENDING BILLS PETITION) కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషనర్, ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. మంగళవారం తీర్పు ఇవ్వనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ ప్రకటించారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..2017, 2018 సంవత్సరాల్లో జరిగిన ఉపాధి పనులకు విజిలెన్స్ పేరు చెప్పి బిల్లులు నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వడ్డీతో సహా అసలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు.
HIGH COURT: ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై నేడు హైకోర్టు తీర్పు
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. పనులపై విజిలెన్స్ విచారణ జరిగిందనడంపై.. పిటిషనర్ల న్యాయవాది స్పందిస్తూ నోటీసులు రాలేదని తెలిపారు.
HIGH COURT
Last Updated : Oct 5, 2021, 2:50 AM IST