suicide attempt : తన అవసరాలకు తల్లి డబ్బులు ఇవ్వడంలేదనే కోపంతో కుమారుడు ఆదివారం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తుతెలియని ద్రావణం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతణ్ని పరిశీలించిన 108 సిబ్బంది పల్స్ అందడం లేదని, మరణించి ఉండొచ్చని నిర్ధారించి వెనుతిరిగారు. అనుమానంతో స్థానికులు నీళ్లు చల్లగా బాధితుడు లేచాడు.
హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని వెంగళరావునగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్(45) షేర్ల ట్రేడింగ్ చేస్తుండేవాడు. భార్య పిల్లలున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో డబ్బు కావాలని తల్లి లక్ష్మితో తరచూ గొడవపడుతుండేవాడు. తండ్రి లక్ష్మీనారాయణ ఏడాది కిందట మరణించారు. వారు ఉంటున్న ఇంటిని అమ్మమని తల్లితో ఘర్షణ పడుతుండేవాడు. తాను చనిపోతానని బెదిరించి ఆదివారం ఇంటిపైకి ఎక్కాడు. తల్లి 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి శ్రీనివాస్‌కు నచ్చజెప్పి కిందకు దించారు.