Man Commits Suicide: తమిళనాడుకు చెందిన వాడపల్లి శివప్రసాద్(48) ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణకు వలసొచ్చాడు. కొన్నాళ్లు విజయవాడ, ఖమ్మంలో ఉన్నాడు. ప్రస్తుతం ఖమ్మం గ్రామీణం ఏదులాపురం వెంపటినగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సమీప కోదాడ అడ్డరోడ్డులోని హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.
కీర్తిశేషులని రాసి ఫొటోకు పూజలు... అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య - వ్యక్తి ఆత్మహత్య వార్తలు
Man Commits Suicide: అనారోగ్యంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. జీవించి ఉండగానే తన ఫొటో వద్ద కీర్తిశేషులు అని రాసిపెట్టుకున్నాడు. దానికి పూజలు కూడా చేశాడు. అనారోగ్యం తీవ్రమవడంతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ఏదులాపురంలో చోటు చేసుకుంది.
ఈ నెల 1న ఇంట్లోకి వెళ్లిన శివప్రసాద్.. ఆ తర్వాత ఇంటి యజమాని కంటపడలేదు. గురువారం ఉదయం కూడా ఎంతకీ తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీల్లోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. శంకర్‌రావు తెలిపారు. శివప్రసాద్ కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలనుకున్నాడు. తన ఫొటో ప్రేమ్ కట్టించుకుని.. ఆపై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చూడండి:పోలీసులు కొడతారేమోనని ఎంత పని చేశాడంటే..!