తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావులను పోలీసులు చంద్రబాబు నివాసంలో గృహనిర్భందం చేశారు. ఇంతకుముందే వీరిని గుంటూరు కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని... మంగళగిరి తెదేపా కార్యాలయంలో దింపుతామని చెప్పి.. తెనాలి మార్గంలో తీసుకొచ్చి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గృహనిర్బంధం చేశారు. చంద్రబాబు నివాసం వైపు వచ్చే అన్ని మార్గాలనూ పోలీసులు ముళ్లకంచెలతో, బారికేడ్లతో మూసివేశారు.
లోకేశ్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు - nara lokesh latest arrest news
గుంటూరు జిల్లా ఖాజా టోల్‌ప్లాజా దగ్గర తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మరో నేత కళా వెంకట్రావులను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తున్నాం అంటూ లోకేశ్‌కు నోటీసులు ఇచ్చారు. తను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరినీ రెచ్చగొట్టేందుకు యత్నించలేదని పోలీసులకు లోకేశ్ తెలిపారు. ఒంగోలు పర్యటనకు వెళ్లి వస్తున్నానని లోకేశ్ చెప్పగా.. ఆయన్ను అదుపులోకి తీసుకొని... ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తరలించారు. లోకేశ్, కళా వెంకట్రావును గృహనిర్బంధం చేశారు.
పోలీసుల అదుపులో లోకేశ్...!
Last Updated : Jan 10, 2020, 6:00 PM IST