ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెన్షన్​లో చినిగిన నోట్లు ఇచ్చి.. వృద్ధుల పొట్ట కొడతారా?: లోకేశ్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెదేపా హయాంలో ఆనందంగా పింఛన్ తీసుకున్నవారు... ఇప్పుడు బాధతో అందుకుంటున్నారని ధ్వజమెత్తారు.

నారా లోకేశ్‌ ట్వీట్

By

Published : Aug 3, 2019, 5:23 PM IST

నారా లోకేశ్‌ ట్వీట్

ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌లో రూ.50 వైకాపా నేతలు పెట్టిన హుండీలో వేయించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. పింఛన్ వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి... రూ.250 మాత్రమే పెంచి... అందులో 50 రూపాయలు హుండీలో వేయించుకుంటున్నారని ఆరోపించారు. మిగిలిన సొమ్ము చిరిగిపోయిన నోట్లు ఇచ్చి... వృద్ధుల నోరుకొడుతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తన పింఛన్ మొత్తం ఇవ్వలేదని ఓ అవ్వ అడుగుతుంటే... చినిగిపోయిన నోట్లిచ్చి మోసంచేశారని మరో తాత నిలదీస్తున్నాడంటూ ట్విట్టర్‌ వేదికగా లోకేశ్ దుయ్యబట్టారు. పింఛన్​లో సగమే ఇచ్చారయ్యా అంటూ... ఓ వితంతువు... వైకాపా నేత తన దగ్గర రూ.50 తీసుకుంటున్నాడని ఓ దివ్యాంగుడు వాపోతున్నాడని వెల్లడించారు. ప్రతినెలా ఒకటో తేదీనే అందుకునే పింఛన్​... గత నెల వారం దాటాక ఇచ్చారని లోకేశ్‌ గుర్తుచేశారు. ఈ నెల సగమే ఇచ్చి అవ్వాతాతలు... వితంతువులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details