మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం ఏపీలో రోజుకి 3 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ నిర్లక్ష్య ధోరణికి ఇంకా ఎంతమంది బలి కావాలి?: లోకేశ్
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో బాలికను మృగాడు బలి తీసుకున్న ఘటనలో.. బాధిత కుటుంబానికి న్యాయం జరగకముందే చిత్తూరులో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి తెగబడ్డారని ఆక్షేపించారు. గాలి మాటలు చెప్పడం తగ్గించి..సీఎం జగన్ మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని చట్టాల పేర్లు చెబుతూ.. ఎంత కాలం మహిళల్ని మోసం చేస్తారని ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చి తప్పా మహిళల రక్షణ మీకు పట్టదా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్య ధోరణికి ఇంకెంతమంది బలైపోవాలని లోకేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదీ చదవండి:ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల కీలక సమావేశం