ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గతంలో తండ్రిని చంపాడు.. ఇప్పుడు తల్లిని కూడా..! - choppadandi crime news

గతంలో తండ్రిని చంపిన కుమారుడే.. ఇప్పుడు తల్లి విషయంలోనూ కాలయముడయ్యాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని అతి కిరాతకంగా దాడి చేసి చంపేశాడు. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగింది.

The son killed the mother in choppadandi
చొప్పదండిలో తల్లి హత్య
author img

By

Published : Mar 1, 2021, 7:27 AM IST

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో దారుణం జరిగింది. పోలుదాసరి కొండయ్య అనే వ్యక్తి... నవ మాసాలు మోసిన తన కన్న తల్లిని అతి కిరాతకంగా కొట్టి చంపాడు. నిందితుడు గత కొంత కాలంగా భార్యా పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు స్థానికులు చెప్పారు. ఈ కారణంగా.. వారంతా దూరంగా ఉండే రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. వీరికి తల్లి పొలుదాసరి హన్నమ్మ తన పింఛన్‌ డబ్బులను ఖర్చులకు ఇచ్చేది.

ఐదేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో జైలుకు వెళ్లిన కొండయ్య... పింఛన్‌ డబ్బులు తనకే ఇవ్వాలని తరచూ తల్లితో గొడవ పడేవాడు. తన భార్యా పిల్లలకు ఇవ్వొద్దని వాదించేవాడు. ఇదే కోపంతో గత రాత్రి ఆమెపై దాడి చేయగా... వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కోడలు విజయ ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details