రైతుల పోరాటాన్ని పోలీసు లాఠీలతో అణచి వేయాలని చూస్తే... చరిత్రలో కలసిపోవడం ఖాయమని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న అన్నదాతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 7 నెలల కాలంలో ఇంత భారీ స్థాయిలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిని... ఇంతవరకు చూడలేదన్నారు. ఇప్పటికైనా రాజధాని విషయంలో జగన్ పునరాలోచించుకోవాలన్నారు...
'ముఖ్యమంత్రి అయ్యావ్.. పద్ధతి మార్చుకో జగన్..' - సీఎం జగన్పై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు తాజా వార్తలు
ముఖ్యమంత్రి అయ్యాక కూడా.. జగన్ తన మనస్తత్వాన్ని మార్చుకోలేదని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుని ఖండించారు. తనను కలిసిన అమరావతి రైతులకు.. వారి పోరాటానికి మద్దతిస్తానని హామీ ఇచ్చారు.
సీఎం జగన్పై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
TAGGED:
kanna comments on cm jagan