కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రి జగనేనని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇలాంటి నేరప్రవృత్తి ఉన్న వ్యక్తి సీఎం కావడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో పాటు వైకాపా నేతలు, అధికారులు జైళ్లకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రం ఆందోళనలతో మండిపోతుంటే వీడియో గేమ్‌లతో సీఎం, కోడి పందేలతో మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రిస్మస్, సంక్రాంతి కానుకలు ఎగ్గొట్టడం ద్వారా కోటి మందికిపైగా పేదల కడుపు కొడుతున్నారని ఆక్షేపించారు. అమరావతి ప్రాంత మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండించారు. ప్రభుత్వం మానవ హక్కులను యథేచ్ఛగా కాలరాస్తోందన్న ఆయన... ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
'సీఎం హోదాలో కోర్టు బోనెక్కిన ఘనత జగన్‌దే' - తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు వార్తలు
ముఖ్యమంత్రి హోదాలో కోర్టు బోనెక్కిన ఘనత జగన్‌దేనని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇలాంటి నేరప్రవృత్తి ఉన్న వ్యక్తి సీఎం కావడం వల్లే ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.