ఎన్డీయేలో చేరేముందు ప్రజలకు వైకాపా ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఎన్డీయేలో చేరుతారా స్పష్టం చేయాలన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధికి నిధులు తెచ్చిన తర్వాతే ఎన్డీయేలో చేరాలన్నారు. ఇవేమీ కాకుండా క్రిమినల్ కేసుల నుంచి బయటపడటమే సీఎం జగన్ ఏకైక అజెండానా అని ప్రశ్నించారు. మండలి ఛైర్మన్ నిర్ణయాలకు కార్యదర్శి అడ్డుపడటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వైకాపా నియంతృత్వ ధోరణిని ఖండిస్తున్నట్లు కనకమేడల తెలిపారు.
'సీఎం గారూ.. దిల్లీ పర్యటనల వివరాలు ప్రజలకు చెప్పండి'
ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనలు చేస్తున్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. దిల్లీకి జగన్ వెళ్లారా లేక వాళ్లే పిలిపించారా అని ప్రశ్నించారు. 9 సార్లు దిల్లీ వెళ్లిన జగన్.. ఒక్కసారి కూడా మీడియాకు వివరాలు వెల్లడించలేదన్నారు. అధికారిక పర్యటనల్లో అంతర్గతంగా ఏం చర్చించారనేది ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు.
కనకమేడల రవీంద్రకుమార్