ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు - పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి

తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనను విచారించేందుకు... 7 గంటల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

jc prabakar reddy is taken into police custody at kadapa
జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

By

Published : Jul 17, 2020, 11:17 AM IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని... కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించేందుకు 7 గంటల పాటు కస్టడీకి తీసుకున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలపై ఇప్పటికే అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేసి కడప కేంద్ర కారాగానికి తరలించారు. కాగా ఇవే ఆరోపణలపై కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ లో నూ కేసులు నమోదు అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details