జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు మీద ఏర్పాటు చేయబడిన పార్టీ అని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ తెలిపారు. జనసైనికులు అండగా నిలబడితేనే రాపాక గెలిచారని ఆయన అన్నారు. రాపాక తన ఊసరవెల్లి మనస్తత్వాన్ని తెలియజేశారన్న మహేశ్... రాపాకపై మండిపడ్డారు. వైకాపాలో డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తామని, తన దగ్గర డబ్బులు లేనందుకే టిక్కెట్ ఇవ్వలేదని రాపాక స్పష్టంగా చెప్పారన్నారు. వైకాపాలో డబ్బు ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని జగన్ మనస్తత్వాన్ని రాపాక బహిర్గతం చేశారన్నారు.
రాపాక రాజకీయ ఊసరవెల్లి: పోతిన మహేశ్
జనసేన గాలివాటం పార్టీ అన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలపై.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మండిపడ్డారు. రాపాక ఓ రాజకీయ ఊసరవెల్లి అని తీవ్రంగా విమర్శించారు. జనసైనికుల దయతో గెలిచిన సంగతి రాపాక మర్చిపోయారని ఆక్షేపించారు. చెడు గెలుపు తాత్కాలికమని, మంచికే ఎప్పటికైనా విజయం లభిస్తుందని పోతిన అన్నారు. డబ్బు ఉంటేనే వైకాపాలో ప్రాధాన్యతని ఆ పార్టీ సిద్ధాంతాన్ని రాపాక స్పష్టం చేశారని మహేశ్ అన్నారు.
రాపాక రాజకీయ ఊసరవెల్లి : పోతిన మహేశ్
వైకాపాకు ఇదే చివరి గెలుపని తన మాటల ద్వారా రాపాక తెలియజేసినందుకు పోతిన ధన్యవాదాలు తెలిపారు. చెడు మొదటి గెలవవచ్చు కానీ మంచి శాశ్వతంగా ఉండిపోతుందని పోతిన స్పష్టం చేశారు. జీరో బడ్జెట్ తో రాజకీయాలు నడిపే పవన్ కల్యాణ్ లాంటి వారి అవసరం దేశానికి ఎంతైనా ఉందని మహేశ్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి :విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష దారుణం: నారా లోకేశ్