NADENDLA MANOHAR : వైకాపా మంత్రుల వాహనాలపై విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైకాపా నాటకాలాడుతోందని విమర్శించారు. దాడి చేసింది జనసేన వాళ్లేనని పోలీసులు నిర్థారించలేదన్నారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తి హడావుడి చేశారని.. కోడికత్తి కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదన్నారు.
పవన్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైకాపా నాటకాలు: నాదెండ్ల మనోహర్ - నాదెండ్ల మనోహర్
MANOHAR : పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైకాపా నాటకాలు ఆడుతోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. దాడి చేసింది జనసేన వాళ్లేనని పోలీసులు నిర్ధారించలేదని స్పష్టం చేశారు. ఇద్దరు మంత్రులపై దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని.. మంత్రుల మీద దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు.
NADENDLA MANOHAR
కోడికత్తి పంథాలోనే ఇప్పడు కూడా దాడి జరిగిందని హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు మంత్రులపై దాడి జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని.. మంత్రుల మీద దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. పవన్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశామని.. అయినా నామమాత్రంగా బందోబస్తు కల్పించారని అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇవీ చదవండి: