జై అమరావతి నినాదాలతో రాజధాని పరిధిలోని ఓ కల్యాణ మండపం మారుమోగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన ఆర్ధల సాంబశివరావు కుమార్తె మౌనికకు లక్ష్మీకాంత్ అనే యువకునితో వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకకు అమరావతి రైతులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జై అమరావతి, ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. అమరావతి పట్ల తమ ఆకాంక్షను వేడుక సాక్షిగా చాటుకున్నారు.