కర్నూలు జిల్లా బసలదొడ్డిలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేయటాన్ని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. "కుల, మత, ప్రాంత, పార్టీలుగా ప్రజల్ని విభజించి పాలిస్తున్న జగన్ రెడ్డి.. మూర్ఖమంత్రిగా నిలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇలాంటి అరాచకాలు సాగుతున్నాయి. వేసవిలో పల్లెలకు తాగునీరు ఇవ్వకుండా వైకాపా నేతలు వికృతానందం పొందుతున్నారు. ప్రతిపక్షం, సామాన్య ప్రజలపైనా కక్ష సాధింపు చర్యలకు దిగటం దారుణం. ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఎంత ఘోరంగా ఉంటుందో జగన్ రెడ్డి పాలనే అందుకు నిదర్శనం. బసలదొడ్డిలో తక్షణమే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి." అని లోకేశ్ డిమాండ్ చేశారు.
'ప్రజల్ని విభజించి పాలిస్తున్న జగన్రెడ్డి.. మూర్ఖమంత్రిగా నిలిచారు' - AP News
సీఎం జగన్పై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. తెదేపా మద్దతుదారులకు వాటర్ నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. జగన్రెడ్డి.. మూర్ఖమంత్రిగా నిలిచారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఎంత ఘోరంగా ఉంటుందో జగన్ రెడ్డి పాలనే అందుకు నిదర్శనం అని ఫైర్ అయ్యారు.
నారా లోకేశ్ హాట్ కామెంట్స్