రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ మొదటి ఏడాది తొలి పరీక్షకు సెట్ నెంబర్-2 ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు ఎంపిక చేసింది. రెండు జిల్లాల్లో పరీక్షలకు విద్యార్థులు బారులు తీరారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాయలసీమ జిల్లాలతోపాటు...నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా పరీక్షలు జరిగాయి. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, కళాశాలల అధ్యాపకులు, ఇంఛార్జిలతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు....కొన్నిచోట్ల అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పరీక్షా కేంద్రానికి విద్యార్థి లక్ష్మణ్ నాయుడు ఆలస్యంగా వచ్చాడు. సమయం మించిపోవడంతో అనుమతించలేమని ఇంఛార్జి చెప్పటంతో.... కన్నీటిపర్యంతమైన విద్యార్థి విషాద వదనంతో ఇంటిముఖం పట్టాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు పరీక్షా కేంద్రంలో...అసౌకర్యాల మధ్య ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...తరగతి గదుల్లో కుర్చీలు, బల్లలు అస్తవ్యస్తంగా పడి ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి:శ్రీచైతన్య విద్యాసంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు