ఇంటర్మీడియట్ పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని సూరారంలో చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయనే భయంతో కీర్తి ప్రియ(17)ఇంట్లో చున్నీతో ఉరేసుకుంది. 2018లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన కీర్తి గత సంవత్సరం పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించలేదు. తిరిగి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసారీ ఉత్తీర్ణత సాధించనేమోననే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే కీర్తిప్రియ చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
పరీక్షలు.. ఈ పేరు వింటేనే చాలామందికి ఏదో భయం. సరిగ్గా రాయలేదనో, ఫెయిల్ అవుతామేమోనన్న భయం విద్యార్థులను వెంటాడుతూనే ఉంటుంది. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడే పరీక్షలు ప్రాణాలు తీస్తున్నాయి. పిల్లలే సర్వస్వం అనుకొని, వారి ఉన్నతిని కోరుకునే తల్లిదండ్రులకు కన్నీటి వ్యధను మిగుల్చుతున్నాయి. తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో పరీక్షలు రాకముందే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలవరపరుస్తోంది.
పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య