కరోనా తీవ్రత కారణంగా తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయి. మొదటి సంవత్సరం ఆయా సబ్జెక్టులో వచ్చిన మార్కులను రెండో సంవత్సరంలోనూ కేటాయించారు. ప్రాక్టికల్స్‌లో వంద శాతం మార్కులను కేటాయించారు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 మార్కులను ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరం సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు పూర్తి చేశారు.
INTER RESULTS: తెలంగాణలో నేడే ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు - telangana latest news
తెలంగాణలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు.
Inter second year results