పర్యాటక రంగం (Tourism) .. కరోనాకు (Corona) ముందు.. తర్వాతలా మారిపోయింది. బస్సుల్లో, రైళ్లలో రోజుల తరబడి ప్రయాణించి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని చాలామంది కోరుకోవడంలేదు. కరోనా బారిన పడకుండా.. జాగ్రత్తగా వెళ్లి.. అంతే భద్రంగా ఇంటికి తిరిగిరావాలని చూస్తున్నారు. అందుకే పర్యాటకులు విమానయానానికి మక్కువ చూపుతున్నారు. సందర్శించాల్సిన ప్రాంతాల సమీపానికి విమానంలో చేరుకుని అక్కడి నుంచి వాహనాలను వినియోగిస్తున్నారు. పర్యాటకుల ఇష్టం మేరకు ఐఆర్‌సీటీసీ (IRCTC) (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) (Indian Railway Catering and Tourism Corporation) 7 విమాన యాత్రలు (7 flights for tourists) నిర్వహిస్తోంది. నగరం నుంచి విమానంలో తీసుకెళ్లి.. అక్కడ రోడ్డు మార్గంలో ప్రయాణాలను కొనసాగిస్తుంది. మొత్తం 7 విమానయాత్రలతో పాటు.. 3 ప్రత్యేక రైలు పర్యాటక వివరాలను ఐఆర్‌సీటీసీ (IRCTC) గ్రూప్ జనరల్ మేనేజర్ డి. నరిసింగరావు మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
- తిరుపతి - కాణిపాకం - శ్రీనివాస మంగాపురం - శ్రీకాలహస్తి - తిరుచానూర్ - తిరుమలలో బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనంతో రెండు రోజుల యాత్ర ప్రతి శుక్రవారం నిర్వహిస్తోంది.
- ఐహోల్ - బదామి - హంపి - పట్టాదక్కల్ పేరిట 4 రోజుల హెరిటేజ్ హంపి యాత్ర ఈ నెల 19న ఉంటుంది.
- సౌత్‌గోవా - నార్త్‌గోవా యాత్రను ‘గోవా డిలైట్’ పేరుతో 4 రోజుల్లో ముగిస్తుంది. ఈ యాత్ర సెప్టెంబరు 24న మొదలవుతుంది.
- అహ్మదాబాద్ - ద్వారక - సోమనాథ్ - స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో 6 రోజుల సౌరాష్ట్రా యాత్ర అక్టోబరు 1వ తేదీన ప్రారంభమవుతోంది.
- శ్రీనగర్ - గుల్‌మార్గ్ - పహల్గామ్ - సోన్‌మార్గ్ యాత్రను మిస్టికల్ కశ్మీర్ యాత్రతో పాటు హౌస్‌బోట్ వసతితో 6 రోజుల యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్ర సెప్టెంబరు 16న ఉంది.
- ప్రయాగ్‌రాజ్ - వారణాసి - బోధ్‌గయాతో కూడిన గంగా గయా యాత్ర 5 రోజులుండేలా రూపొందించారు. సెప్టెంబరు 22న నిర్వహిస్తోంది.
- రాయల్ రాజస్థాన్ పేరిట 6 రోజుల పాటు సాగే జైపూర్ - జోధ్‌పూర్ - పుష్కర్ - ఉదయ్‌పూర్ యాత్ర సెప్టెంబరు2వ తేదీన నిర్వహిస్తోంది.
మాసానికోసారి..
ఐఆర్‌సీటీసీ దేశీయంగా విమానయాత్రలు కొనసాగిస్తూనే.. ‘పిలిగ్రిమ్ స్పెషల్ టూరిస్టు ట్రైన్’ను నడుపుతోంది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ నెలకో యాత్ర నిర్వహిస్తోంది. ఆగ్రా-మధుర-వైష్టోదేవి-అమృత్‌సర్ - హరిద్వార్-దిల్లీ సందర్శనకు గాను ఈ రైలు ఈనెల 27న బయలుదేరుతుంది. వారణాసి-గయా-ప్రయాగ్‌రాజ్ యాత్ర సెప్టెంబరు 25న ప్రారంభమౌతోంది. తిరుచిరాపల్లి-తంజావూర్- రామేశ్వరం-మధురై-కన్యాకుమారి-మహాబలిపురం-కాంచీపురం ప్రాంతాల సందర్శనకు ఉద్దేశించిన యాత్ర అక్టోబరు 19న మొదలవుతుంది.