ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Diwali 2021: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి శోభ.. కళకళలాడుతున్న మార్కెట్లు

By

Published : Nov 4, 2021, 7:18 AM IST

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండగ కళ (Diwali celebrations 2021) సంతరించుకుంది. సాయంత్రం నుంచి టపాసుల మోత మోగనుంది. వీధులన్నీ వెలుగుల జిలుగులతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. దీపావళి సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. టపాసులు, పూలు, ప్రమిదలు, స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

Diwali celebrations in telangana
తెలంగాణ వ్యాప్తంగా దీపావళి శోభ

చెడుపై మంచి విజయానికి సంకేతమే దీపావళి. ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor Bishwabhushan Harichandan) ఆకాంక్షించారు. దీపావళి వేడుకను పురస్కరించుకని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు (diwali wishes)తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్(CM Jagan) దీపావళి (diwali wishes)శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని సీఎం జగన్(CM Jagan) ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులతో పండుగ చేసుకొని స్వదేశీ తయారీదారుల జీవితాల్లో వెలుతురు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దీపావళిని దేశ ప్రజలు జరుపుకుంటారన్నారు. మహోన్నతమైన సంస్కృతిని తెలియజెప్పే దీపావళి పండుగను దేశప్రజలు సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.

మార్కెట్లు కళకళ..

దీపావళి వేళ... మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. పూల మార్కెట్లు రద్దీగా దర్శనమిస్తున్నాయి. బంతిపూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కిలో 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది. పిల్లలు ఉత్సాహంగా టపాసులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడాదికి ఏడాదికి మార్కెట్లో రకరకాల బాణాలు రావటంతో అవి కొనేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

రకరకాల స్వీట్లు..

మిఠాయిల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. రకరకాల స్వీట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పండగ సందర్భంగా సరికొత్త మిఠాయిలను అందుబాటులోకి తెచ్చారు. పండక్కి కొన్ని రోజుల ముందు నుంచే రకరకాల రుచులను సిద్ధం చేసి కొనుగోలుదారులకు అందిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా స్వీట్లను అందుబాటులో ఉంచారు.

విద్యుద్దీప కాంతులతో..

హైదరాబాద్​లోని చార్మినార్‌ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దీపావళి సందడి నెలకొంది. విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. దీపావళి సందర్భంగా (Diwali celebrations 2021) అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని లైట్లతో అలంకరించారు. విద్యుద్దీపకాంతుల్లో సాంస్కృతిక వేదిక వెలిగిపోతోంది.

నిబంధనలు పాటించాలి..

కొవిడ్ నిబంధనలు మాత్రం ఎవరూ పాటించటం లేదని పలువురు అంటున్నారు. రెండో వేవ్ తర్వాత ప్రజల్లో భయం తగ్గిపోయిందన్నారు. మూడో వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నా అవన్నీ పెడచెవిన పెడుతున్నట్లు చెప్పారు.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details