ఇసుకను నేరుగా రీచ్ వద్దకే వెళ్లి తెచ్చుకునే విధానాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. "ప్రజలతో నాడు-ప్రజల కోసం నేడు" కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పాదయాత్ర చేసిన ఆమె.. రాష్ట్రంలో ఇసుక సమస్య లేదన్నారు. ఇసుక కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తమేనని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇసుక మరింత సులువుగా ప్రజలకు అందేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఇసుక సమస్య లేదు: హోంమంత్రి సుచరిత - మేకతోటి సుచరిత వార్తలు
రాష్ట్రంలో ఇసుక సమస్య లేదని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇసుకను నేరుగా రీచ్ వద్దకే వెళ్లి తెచ్చుకునే విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇసుక మరింత సులువుగా ప్రజలకు అందేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.
home minister mekathoti sucharitha