ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫామ్‌హౌజ్‌ వివాదం: కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ - CJ Justice Chauhan Latest News

ఫామ్‌హౌజ్‌ వివాదంలో మంత్రి కేటీఆర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను ఆయన్ సవాల్ చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది.

highcourt-hea
highcourt-hea

By

Published : Dec 16, 2020, 4:48 PM IST

ఫామ్‌హౌజ్‌ వివాదంలో కేటీఆర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను కేటీఆర్ సవాల్ చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది.

నేడు సీజే జస్టిస్ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం వద్ద కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చింది. స్టే ఉత్తర్వులు ఎత్తివేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. పిటిషన్‌లో అనేక అంశాలపై విచారణ జరపాల్సి ఉందని సీజే జస్టిస్ చౌహాన్ పేర్కొన్నారు. త్వరలో తాను బదిలీ కానున్నందున ఇప్పుడు సమయం సరిపోదని వెల్లడించారు. ఉన్నత న్యాయస్థానం... కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details