ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు తొలిగిన అడ్డంకులు

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలిగాయి. సచివాలయం కూల్చివేత వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. కూల్చివేత వివాదంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. మంత్రి మండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం పేర్కొంది.

తెలంగాణ సచివాలయం కూల్చివేత వివాదంపై హైకోర్టు  తీర్పు
తెలంగాణ సచివాలయం కూల్చివేత వివాదంపై హైకోర్టు తీర్పు

By

Published : Jun 29, 2020, 11:53 AM IST

తెలంగాణ సచివాలయం కూల్చివేత వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుత భవనాన్ని కూల్చి.. నూతన నిర్మాణాలను చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డితో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం మార్చి 10న తీర్పును రిజర్వ్ చేసింది.

ఇవాళ ఆ పిటిషన్లపై విచారణ జరగగా... వాటిని హైకోర్టు కొట్టివేసింది. కూల్చివేతపై కేబినెట్ నిర్ణయంలో తప్పు కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సచివాలయం కూల్చివేతపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details