మాజీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్ గవర్నర్‌కు రాసిన లేఖల లీకేజీపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. సీబీఐతో దర్యాప్తు కోరుతూ ఎస్ఈసీ వ్యాజ్యం దాఖలు చేయడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ప్రభుత్వం తరపున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదించారు. ఆ వ్యాఖ్యాన్ని సదుద్దేశంతో వేశారా ? లేదా ? అనే విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. లీకుల ద్వారా ఎవరు నేరం చేశారు. తదితర వివరాల్ని పిటిషన్లో పేర్కొనలేదన్నారు.
ప్రభుత్వంపై బురద జల్లేందుకే..
ప్రభుత్వ వ్యవస్థలపై బురద జల్లేందుకు వ్యాజ్యం వేశారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాని విషయంలో, మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు నమోదు చేయని విషయంలో సీబీఐ దర్యాప్తు కుదరదన్నారు. పిటిషనర్ వేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చాలని అభ్యర్థించారు.
'ఆ భాద్యత పిటిషనర్‌పై ఉంది '
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపు న్యాయవాది వీఆర్ఎస్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌కు రాసిన లేఖలు బయటకు రావడానికి వీల్లేదని ఏ చట్టం చెబుతుందో పిటిషనర్ పేర్కొనలేదన్నారు. అవి బయటకు రావడం చట్ట విరుద్ధం అని రుజువు చేయాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉందన్నారు.