ఎస్వీయూ పరిధి కళాశాలలకు రెక్టర్ గుర్తింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది(high court on svu). వర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చారని దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని వర్సిటీ అధికారులకు ఆదేశించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
నిబంధనలకు విరుద్ధంగా 137 కాలేజీలకు గుర్తింపు ఇచ్చారని చిత్తూరుకు చెందిన దొరస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముడుపులు తీసుకొని వర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చారన్న ఆయన సీబీఐ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.