ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2021, 2:22 AM IST

ETV Bharat / city

NAREGA: చెల్లింపుల వివరాలతో అఫిడవిట్​ దాఖలు చేయండి

ఉపాధి హామీ పనుల బిల్లులు పెండింగ్​ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్​ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

NAREGA
NAREGA

ఉపాధి హామీ పనుల కోసం 2014 నుంచి ఏపీకి చెల్లించిన నిధుల వివరాలు ఎందుకు సమర్పించలేదంటూ.. కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ, ఈలోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశించింది. ఈసారి విఫలమైతే.. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్దేశించింది. ఉపాధిహామీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేసిన హైకోర్టు.. 2014 నుంచి కేటాయించిన నిధులు, ఇంకా చెల్లించాల్సింది ఎంత అనే వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాజా విచారణలో కేంద్రం దాఖలుచేసిన మెమోపై అసంతృప్తి వ్యక్తంచేసిన న్యాయమూర్తి.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి హాజరుకు ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ అభ్యర్థన మేరకు అఫిడవిట్ వేసేందుకు చివరి అవకాశం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details