TS High Court : కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న తెలంగాణ హైకోర్టు.. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల వివరాలు, హెల్త్ బులెటిన్‌లో వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది.
కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
Telangana high court about corona : భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియంత్రణపై మంత్రివర్గం ఇవాళ చర్చించనుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కరోనా కేసులపై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.