మేషం
ఈ వారం మొదటి రోజు అలసిపోయినట్టుగా, చికాకు, విసుగుతో ఉంటారు. ఈ వారంలో ఏదైనా సామాజిక లేదా ఏదైనా మతపరమైన వేడుకకు హాజరయ్యే సూచనలున్నాయి. రెండో రోజు నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార పర్యటన చేసే అవకాశం ఉంది. ఈ వారం మధ్యలో ప్రజలకు సాయమందించే పనుల్లో పాల్గొంటారు. విశ్రాంతి అవసరం. మీ వైవాహిక జీవితం, సంబంధాల విషయంలో ఈ వారం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వారితో కలిసి బయటకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఉన్నత విద్యలో ఉంటే చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఉద్యోగులు బాగా కష్టించి, తమ నైపుణ్యం ద్వారా చక్కని పనితీరు కనబరుస్తారు. సీనియర్ల సహకారంతో మంచి పురోగతి సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంకాని, లేదా ఇతరుల నుంచి సలహాలుగాని తీసుకోవడం చేయకండి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, శరీరంలో అధిక కొవ్వును దూరం పెట్టండి.
వృషభం
వృత్తి జీవితం కంటే కుటుంబం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఏదైనా కొత్తది, సృజనాత్మకంగా పని చేసే మహిళలకు లాభిస్తుంది. పెద్దల మాట మేలు చేస్తుంది. నిరుద్యోగులైతే ఈ వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ ఈ వారం చాలా కలిసొస్తుంది. విద్యార్థులు తమ చదువులపై శ్రద్ధ చూపుతారు, కానీ ఇతర పనులు చేయడం వల్ల వారి ప్రగతి కుంటుపడుతుంది. ఈ వారం చివరి రోజు ఒకింత నిరాశకు లోనవుతారు. కాబట్టి ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టడం మంచిది.
మిధునం
ప్రసంగం, సమావేశం, చర్చలో విజయం సాధిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉంటే అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎదుటివారిని కట్టిపడేస్తారు. విద్యార్థులకు 30నుంచి 1 తేదీ వరకు సానుకూలంగా ఉంది. ఈ సమయంలో చదువులో సాధించిన దానికి బహుమతి లేదా స్కాలర్ షిప్ అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యానికి హాజరయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమకు సంబంధించి ఈ వారంలో రెండో, మూడో రోజు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మీ భాగస్వామిలో గొప్ప నమ్మకం, అనుబంధం ఏర్పరుచుకోవాల్సి ఉంటుంది. కుటుంబసభ్యుల సంతోషం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.
కర్కాటకం
ఈ వారంలో సృజనాత్మకతను మరింత పెంపొందించుకుంటారు. ఈ వారం చివరి రోజు నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత సందిగ్ధతకు లోనవుతారు. ఆ కారణంగా ఓ సువర్ణావకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి. వృత్తిపరంగా చక్కని పనితీరు కనబరుస్తారు. ఈ సమయంలో ఉద్యోగులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టేందుకు ఈ వారం అనుకూలంగా ఉంది. స్నేహితులతో
ఓ మంచి వార్త వింటారు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ప్రేమించే వ్యక్తిని కలుసుకునేందుకు ఈ వారం ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. భావోద్వేగాలు మీ ఊహాల చుట్టు తిరుగుతుంటాయి. కుటుంబంపై అధిక శ్రద్ధ చూపుతారు. ఏదైనా శుభకార్యానికి వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదృష్టం అనేక అవకాశాలు తీసుకువస్తుంది. ఈ వారం విద్యార్థులకు బాగుంది. గొప్ప ఫలితాలు సాధిస్తారు. వారం చివరి రెండు రోజుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
సింహం
మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మకత, ఊహశక్తి ఈ సమయంలో గొప్పగా ఉంటాయి. అనుబంధం భావోద్వేగాలతో నిండి ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విందు భోజనం చేస్తారు. పిల్లల చదువులు, ఆరోగ్యం గురించి కొంత ఆందోళనకు గురవుతారు. అదే సమయంలో వారితో గడిపే సమయం తగ్గిపోతుంది. అత్యవసర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల విషయంలో కఠినంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని కఠినమైన సబ్జెక్టులు అర్థం చేసుకునేందుకు వారు ఇతరుల సాయం కోరాల్సి రావచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. బాకీ వసూలు, రుణం మొదలైన ఆర్థిక వ్యవహారాలు ఈ సమయంలో సానుకూల ఫలితాలు తీసుకువస్తాయి.
కన్య
మీ బాధ్యతలన్నింటినీ నెరవేర్చుతారు. అది మీ నమ్మకాన్ని మరింత పెంచుతుంది. కుటుంబం సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే అపోహాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మళ్లుతారు. ఉద్యోగులు, వ్యాపారస్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన సంబంధాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అది మీ లక్ష్యసాధనలో సాయపడుతుంది. ఈ వారం మధ్యలో విహార యాత్రకు వెళ్లే సూచనలున్నాయి. ప్రేమించే వ్యక్తిని ఈ వారంలో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అది మీ సంతోషాన్ని పెంచుతుంది. వివాహితులు ఈ వారం పరస్పరం మరింత దగ్గరవుతారు.