ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మన్యం జిల్లాలో భారీ వర్షం.. ముంపులో జిల్లా కేంద్రం.. - ముంపులో పార్వతీపురం బైపాస్​ కాలనీ

పార్వతీపురం మన్యం జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి బైపాస్ కాలనీ వరద నీటితో ముంపునకు గురైంది. వరాహాల గడ్డ ఉప్పొంగి ప్రవహించడంతో.. బైపాస్ కాలనీలోని ఇళ్లు నీట మునిగాయి. ఎమ్మెల్యే జోగారావు, పుర కమిషనర్ ఆనంద్.. కాలనీలోని పరిస్థితి పరిశీలించి.. సహాయక చర్యలు చేపట్టారు. ఎప్పుడు వర్షం కురిసినా.. తమ పరిస్థితి ఇదేనంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన్యం జిల్లాలో భారీ వర్షం
మన్యం జిల్లాలో భారీ వర్షం

By

Published : Jul 30, 2022, 10:46 AM IST

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం బైపాస్ కాలనీ గడ్డ వరద నీటితో ముంపున గురైంది. శుక్రవారం రాత్రి వరహాలు గడ్డ లో ప్రవాహం పెరగడంతో వరద నీరు బైపాస్ కాలనీలో చేరింది. కాలనీ ముంపును గురి కావడంతో నివాసితులు రాత్రంతా జాగారం చేశారు. ఎమ్మెల్యే జోగారావు, పుర కమిషనర్ ఆనంద్.. కాలనీలోని పరిస్థితి పరిశీలించి.. సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం పార్వతీపురం ఎగువ భాగంలో కొండలపై భారీ వర్షం కురిసింది. ఫలితంగా వరహాలు గడ్డలో ప్రవాహం పెరిగింది. రాత్రి 10:00 సమయంలో గడ్డ పక్కనే ఉన్న బైపాస్ కాలనీలోకి వరద నీరు చేరింది. ఒక వీధి పూర్తిగా ముంపునకు గురైంది. కొన్ని ఇళ్లల్లోకి నీరు చేరింది. కాలనీ వాసులు రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. 10 కుటుంబాలు పక్కనే ఉన్న రైతు కూలీ సంఘం భవనంలోకి వెళ్లి తల దాచుకున్నారు. గతంలోనూ గెడ్డ ఉప్పొంగడంతో కాలనీ మొత్తం ముంపునకు గురైంది. గెడ్డకు రక్షణ కూడా నిర్మించారు. అయినప్పటికీ ఏటా వర్షాకాలంలో ముంపు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుర కమిషనర్ ఆనంద్ రాత్రి కాలనీని సందర్శించారు. ఎమ్మెల్యే జోగారావు వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ద్వారపురెడ్డి శ్రీదేవి కాలనీలో పర్యటించారు. ఎమ్మెల్యే బాధితులకు అల్పాహారం అందించారు.

మన్యం జిల్లాలో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details