ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మందడంలో చంద్రబాబుకు ఘనస్వాగతం - శాసన మండలి వార్తలు

శాసన మండలి ఛైర్మన్.. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై తెలుగుదేశం హర్షం వ్యక్తం చేసింది. శాసన మండలి నుంచి మందడం పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ నేతలకు.... రైతులు అపూర్వ స్వాగతం పలికారు. చంద్రబాబు విజయ సంకేతం చూపుతూ అన్నదాతల్లో ఉత్సాహం నింపారు.

grand welcome for  chandra babu in mandadam
grand welcome for chandra babu in mandadam

By

Published : Jan 23, 2020, 6:27 AM IST

మందడంలో చంద్రబాబుకు ఘనస్వాగతం

వికేంద్రీకరణ బిల్లు,సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ఛైర్మన్ నిర్ణయంతోరాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం కనిపించింది.మందడంలో పర్యటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేబాలకృష్ణ,నారా లోకేశ్ సహా ఇతర నేతలకుస్థానికులు అపూర్వ స్వాగతం పలికారు.రైతులు,అభిమానులకుచంద్రబాబు కారులో అభివాదం చేస్తూ ముందుకు సాగారు.చంద్రబాబుకు శాలువా కప్పేందుకు ముందుకు దూసుకొచ్చిన రైతునుఆయన కారు దిగి పలకరించారు.రాజధాని అమరావతిభవిష్యత్తుపై భరోసా కల్పించారు.ప్రజల్లో లోకేశ్ మమేకమై రాజధాని అంశంపై భవిష్యత్తులోనూ పోరాడతామని హామీ ఇచ్చారు.ఇలాంటి బిల్లుల నుంచి అమరావతిని కాపాడతామని భరోసా ఇచ్చారు.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు...బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details