ఏపీ శాసన మండలిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. తనకున్న విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెలెక్ట్ కమిటీకి పంపినందున మూడు నెలలపాటు ఈ బిల్లులు పెండింగ్‌లో ఉండే అవకాశముంది. మరోవైపు శాసన మండలి ఛైర్మన్ నిర్ణయంపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. రెండ్రోజుల క్రితం ఈ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
మండలి నిర్ణయం పట్ల రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. మందడం రహదారిపైకి వచ్చి సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు పట్టుకొని జై అమరావతి అంటూ ర్యాలీలు నిర్వహించారు.
ఇదీ చూడండి: మందడంలో రైతుల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు