రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు - రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. విభిన్న ప్రతిమలలో గణపయ్యలు కొలువుదీరి ప్రత్యేక పూజలందుకున్నారు. వినూత్న రీతుల్లో భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. సాంస్కృతిక కార్యక్రమాలతో యువత అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.వినూత్న రీతుల్లో గణపయ్యలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.గుంటూరులోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన35అడుగులు మట్టి వినాయకున్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు.తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులో వేడుకల్లో భాగంగా యువతులు చేసిన కోలాట కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్వామివారిని500కేజీల కూరగాయలతో అలంకరించారు.తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లిలోని ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.విశాఖ జిల్లా ఖండివరంలో వినూత్న ఆలోచనతో...అన్నప్రసాదం స్వీకరించిన భక్తులకు మొక్కలను పంపిణీ చేశారు.కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పిల్లారాయుడిగా భక్తులతో కొలవబడే గణపతిని పూల ఊయలలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీకాకుళం,ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేక పూజలు,పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
TAGGED:
ganesh