చంద్రబాబుకు పేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యనించారు. గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళల భేటీకి హాజరైన ఆయన...అమరావతి పోరాటానికి సంఘీభావం తెలిపారు. "అమరావతిని ప్రపంచస్థాయి పట్టణంగా మార్చాలనుకున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఆలోచన, విజన్ లేదు. రైతులు, మహిళల పోరాటం మరింత ఉద్ధృతం చేయాలి. కేంద్రం ఇప్పటికైనా అమరావతిపై స్పందించాలి" అని జయదేవ్ వ్యాఖ్యనించారు.
గతంలో అమరావతి కోసం జైలుకు వెళ్లానని.., భవిష్యత్తులోనూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.