కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తెదేపా హయాంలో తెచ్చిన వ్యవస్థల్ని వినియోగించాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతిపక్షాలు, మేధావుల సలహాలు తీసుకోవాలని హితవు పలికారు. కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సీఎం జగన్‌ను కోరారు. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన మెడ్ టెక్ జోన్‌ను మంత్రులు తమ ఘనతగా చెప్పుకోవడాన్ని ఆనందబాబు తప్పుపట్టారు. మాస్కులు, గ్లౌజుల కోసం అడిగిన వైద్యున్ని సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు. వైద్యుల సమస్యలు పట్టించుకోకపోతే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
'సీఎం గారూ.. కరోనా కట్టడి కోసం చిత్తశుద్ధితో పని చేయండి' - కరోనా విషయంలో సీఎం జగన్‌కు నక్కా ఆనందబాబు సూచనలు తాజా వార్తలు
కరోనా కట్టడి కోసం వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీలకతీతంగా ప్రతిపక్షాలు, మేధావుల సలహాలు తీసుకుని.. వైరస్ కట్టడి కోసం కృషి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు