రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకులపై పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర సరఫరాల సంస్థ మాజీ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ పెంపుతో ప్రజలపై ఏడాదికి రూ.600 కోట్లు భారం పడుతుందన్నారు. కరోనా వల్ల ప్రజలకు ఆదాయం తగ్గితే ఇలా ధరల పెంపు సరికాదని హితవు పలికారు. రేషన్ షాపుల్లో ధరలు పెంచితే బహిరంగ మార్కెట్లో కూడా ధరలు పెంచేస్తారని.. ఇది ప్రజలకు మరింత భారంగా మారుతుందని అన్నారు. పాత ధరలకే కందిపప్పు, చక్కెర ఇవ్వాలన్నారు.
వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా రేషన్ డీలర్ల ఉద్యోగాలు ఉంటాయో లేదో అని ఆందోళన నెలకొందని.. రేషన్ డీలర్ల వ్యవస్థను కాపాడాలని లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీలర్ల కమీషన్ రూపాయి నుంచి రెండు రూపాయలకు పెంచి వారిని ఆదుకోవాలన్నారు.