ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్రాక్టర్లు ఇవ్వకుంటే ఎలా?.. యంత్రాలతోనే పని జరిగేదెలా? - రైతు భరోసా ట్రాక్టర్ల వార్తలు

రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీతో రూ. 15 లక్షల విలువైన యంత్ర పరికరాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంపిక చేసిన లబ్ధిదారులు 10 శాతం చెల్లించాలనే నిబంధన విధించింది. తీరా చూస్తే ట్రాక్టర్​ ను మినహాయించింది. కేవలం యంత్రాలు తీసుకుని ఏం చేయాలని రెతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Tractors better in RBK
ట్రాక్టర్లు ఇవ్వకుంటే ఎలా?

By

Published : Dec 19, 2020, 1:46 PM IST

రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు(సీహెచ్‌సీలు) ప్రారంభం కాలేదు. యంత్రాల అద్దె, కేంద్రాల ప్రారంభంపై స్పష్టత లేదు. దాంతో రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 940 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో ఆర్‌బీకే ద్వారా రైతులను బృందాలుగా ఏర్పాటు చేయించి వారే అద్దె కేంద్రాలను నిర్వహించేలా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఒక్కో రైతు భరోసా కేంద్రంలో అయిదుగురు రైతులను బృందంగా ఎంపిక చేశారు. ఆర్‌బీకేలతో అనుసంధానం చేసి ఆయా గ్రామాల్లోని రైతులకు తక్కువ ధరకే సాగు యంత్రాలను అద్దెకు ఇవ్వాలనేది ప్రభుత్వాశయం.

ఏమిస్తారంటే..

ఒక్కో ఆర్‌బీకే ద్వారా సుమారు రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చే రాయితీ 40శాతం, మరో 50శాతం బ్యాంకుల్లో రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన లబ్ధిదారులు 10శాతం చెల్లించాలి. రైతులకు అవసరమైన ట్రాక్టరు, దుక్కి మడకలు, విత్తన గొర్రు, పిచికారీ యంత్రాలు, రోటోవేటరు, లోతు దుక్కులు బహుళ పంటల మార్పిడి యంత్రాలు, ఇతర పరికరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆర్‌బీకేల వారీగా ఏ రకం పరికరం అవసరమో రిజిస్ట్రేషన్‌ సైతం చేశారు.

పరికరాలే..

ట్రాక్టరు మినహా ఇతర పరికరాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పరికరాల రిజిస్ట్రేషన్‌కు రైతులు ముందుకు రావడం లేదు. నిర్ణయం మార్పు ఆదేశాలిచ్చి నెల రోజులైనా ఇప్పటికి కేవలం 940 ఆర్‌బీకేలకు గాను 248 ఆర్‌బీకేల్లోనే నమోదు జరిగింది. కేవలం యంత్రాలు తీసుకుని ఏం చేయాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ ఎంపికలో గేట్​ కీలకం

ABOUT THE AUTHOR

...view details