ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్టు.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

Fake call center gang arrested: నెలకు లక్షల్లో సంపాదన.. హంగులూ ఆర్భాటాలు.. విలాసవంతమైన జీవితం.. ఇదీ నకిలీ కాల్​ సెంటర్​లు నిర్వహించే వారి జీవితం. కాల్​ చేస్తారు ఆ కాల్​ గానీ, వారు పంపే మెస్సెజ్​ గానీ చూశారో.. ఇంక మీ జేబుకు చిల్లు పడినట్లే. ఇలా ప్రజలను మోసం చేసి వచ్చిన సొమ్ముతో ఎంత ఖరీదైన జీవనం సాగించిన ఏదో ఒకరోజు ఆ ప్రయాణానికి బ్రేకులు పడకమానదు. అటువంటి ముఠానే పోలీసులకు చిక్కింది. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఈ ప్రత్యేక కథనం చూద్దామా..

cheating
cheating

By

Published : Sep 22, 2022, 5:39 PM IST

Fake call center gang arrested: కాల్ సెంటర్‌లో ఉద్యోగం.. ఇచ్చిన పని పూర్తి చేస్తే.. వచ్చిన మొత్తంలో 30 శాతం వాటా. ఏసీ గదుల్లో కూర్చొని.. కస్టమర్లకు ఫోన్ చేసి వివరాలు చెబితే చాలు.. నెలకు లక్షల్లో సంపాదన. ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా? వీరంతా నకిలీ కాల్ సెంటర్లలో పని చేస్తూ ప్రజలకు బురిడీ కొట్టిస్తున్న ముఠా. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. తెలుగు ప్రజల్ని మోసం చేసేందుకు టెలీకాలర్స్‌ను నియమించుకుంటున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కింది.

నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్టు.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

రంగారెడ్డి జిల్లాలో ఆన్​లైన్​ మోసం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కిషన్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో 550 రూపాయలతో కుట్టు మిషన్‌ ఆర్డర్ చేశాడు. ఆ వస్తువు ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లో.. సంస్థ పేరు మీద ఓ పోస్టు వచ్చింది. కవర్‌ను తెరిచిచూస్తే.. కుట్టు మిషన్ కొన్నందుకు స్క్రాచ్‌కార్డు పంపుతున్నామని కార్డును పంపించారు. కార్డును స్క్రాచ్‌ చేయగా 8లక్షల 20వేల విలువైన మహీంద్రా ఎక్స్‌యూవీ కారు గెలుచుకున్నారని రాసి ఉంది. ఆ బహుమతి పొందాలంటే ఈ నంబర్‌కు కాల్‌ చేయాలంటూ పొందుపరిచారు.

స్పందించిన వినియోగదారుడు కిషన్‌.. వాళ్లు పంపిన నంబర్‌కు ఫోన్ చేశాడు. వాహనం పంపేందుకు పలు ఛార్జీల కింద విడతలవారీగా.. 48వేలు వసూలు చేశారు. మరిన్ని డబ్బులు అడుగుతుండటంతో బాధితుడికి అనుమానం వచ్చి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రాచకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో పాటు ఇదే తరహాలో నమోదైన కేసుల్లో ఐపీ అడ్రస్, టవర్ లొకేషన్ ద్వారా నిందితులు పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. 12 మంది సిబ్బందితో కోల్‌కతా వెళ్లిన బృందం నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. పక్కా సమాచారంతో దాడులు చేసి ప్రధాన నిందితుడు సహా 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక కారు, లక్షా 62వేల నగదు, 39 సెల్‌ఫోన్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు సహా.. ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ కాల్​ సెంటర్​ల నిర్వాహణ:బిహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఉత్తమ్‌కుమార్ 2017 నుంచి పలు రాష్ట్రాల్లో నకిలీ కాల్ సెంటర్లలో పనిచేసి అనంతరం స్నేహితుల సాయంతో సొంతంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాడని తెలిపారు. ఇదే సమయంలో పలు రకాల సైబర్ నేరాల కోసం కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన ముదావత్ రమేష్ పరిచయమయ్యాడు. అతనితోపాటు కాల్ సెంటర్ మోసాల్లో ఆరితేరిన పాట్నాలోని రమేష్ మాలిక్ గ్యాంగ్‌లో పని చేసిన బిహార్‌కు చెందిన ముకేష్ కుమార్, గుంటూరుకు చెందిన కొండా జగన్మోహన్ రెడ్డిలు ఉత్తమ్‌తో కలిశారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు: తెలుగు ప్రజలను మోసం చేసేందుకు టెలీకాలర్స్ కావాలని నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కాల్ సెంటర్‌లో మంచి ఆఫర్‌ ఉందని మరో నలుగురు చేరారు. ప్రజలను మోసం చేసి డబ్బు వసూలు చేస్తే 30 శాతం వాటా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వ్యక్తిగత రుణాలు, ఈ కామర్స్ మోసాలు, లాటరీ, ఉద్యోగాలు, కేవైసీ, రివార్డ్ పాయింట్స్ అంటూ కాల్ సెంటర్ల ద్వారా కోట్ల రూపాయలు కాజేశారు. వీరిపై 19 రాష్ట్రాల్లో 116 కేసులు ఉండగా... ఒక్క తెలంగాణాలోనే 34 కేసులు ఉన్నాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details