ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Employees Unions future action for PRC: జగన్ సర్కారుపై ఉద్యోగ సంఘాల ఉద్యమం.. కార్యాచరణ ప్రకటించిన నేతలు

ఉద్యోగ సంఘాల సమావేశం
ఉద్యోగ సంఘాల సమావేశం

By

Published : Nov 28, 2021, 7:26 PM IST

Updated : Nov 29, 2021, 4:16 AM IST

19:14 November 28

Employees JAC protest: పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పి మాట తప్పారు: ఉద్యోగ సంఘాలు

ఉద్యోగ సంఘాల సమావేశం

ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు(employees JAC protest for PRC report)ఆందోళనబాట పట్టనున్నారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఐకాస(JAC) నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్ 1న సీఎస్​కు వినతిపత్రం అందించి... ఆందోళనకు సిద్ధం కానున్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు మొదలు... 4 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

AP Employees JAC protest for PRC :వేతన సవరణతోపాటు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగల సంఘాలు(employees JAC protest) ఆందోళన బాటపట్టనున్నాయి. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు పలు దఫాలుగా నిరసన ప్రదర్శనలతోపాటు... ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి స్పష్టంచేశాయి. ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని.. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాయి. ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని వివరించాయి. రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తాయి. ప్రభుత్వమే ఉద్యమం దిశగా తమను నెట్టిందని... ఇందుకు సర్కారే బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.

పీఆర్​సీ(AP PRC)పై ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలకే(AP employees JAC news) దిక్కులేకుండా పోయిందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. కించపరిచేలా మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాగ్‌ నివేదిక బయటపెట్టినప్పుడు.. పీఆర్‌సీ నివేదిక బహిర్గతం చేయడానికి అభ్యంతరమేంటని వారు ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ నోరుమెదపడం లేదన్నారు. పీఆర్​సీ అంశాన్ని వారంలోగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వేతన సవరణ అమలుపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి

గుడ్​ న్యూస్​.. డిసెంబరులో తగ్గనున్న గ్యాస్ ధర!

Last Updated : Nov 29, 2021, 4:16 AM IST

ABOUT THE AUTHOR

...view details