ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees Unions On PRC: ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని.. సీఎం​ను కోరాం: ఉద్యోగ సంఘాలు

Employee unions On PRC: ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫిట్​మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్​ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికి ఒకే జీవో ఇవ్వాలని ఇవాళ జరిగిన సమావేశంలో సీఎం జగన్​ను కోరామన్నారు.

ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని.. సీఎం​ను కోరాం
ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని.. సీఎం​ను కోరాం

By

Published : Jan 6, 2022, 4:27 PM IST

Updated : Jan 6, 2022, 10:16 PM IST

Employees unions On PRC: ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎం జగన్​ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు..ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్‌ ఇచ్చారన్నారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించారని తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సీఎం జగన్​ను కోరామన్నారు.

"రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆర్థికశాఖ కార్యదర్శి వివరించారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని సీఎంను కోరాం. 2010లో వేతన సవరణ సంఘం వేతనాలపై అధ్యయనం చేసింది. 27 శాతం సిఫార్సు చేస్తే అప్పటి ప్రభుత్వం 39 శాతం ఇచ్చినట్లు చెప్పారు. 2010లోనే 39 శాతం వేతనాల పెరుగుదల శాస్త్రీయమన్నారు. 2022లో ఎంత శాతం వేతనాలు పెంచాలో ఆలోచించాలని కోరాం. పెన్షనర్లకు ఉన్న రాయితీని తగ్గించే ప్రతిపాదనలు అంగీకరించవద్దని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించలేదు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది జీతభత్యాలు పెరగలేదు. సిబ్బంది జీతభత్యాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరాం. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది జీతభత్యాలు పెరగాల్సి ఉంది. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని కోరాం. గత ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. రాష్ట్ర ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాం" - సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత

ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని.. సీఎం​ను కోరాం

ఆదాయం వచ్చేలా కష్టపడి పని చేస్తాం..

కష్టపడి పని చేస్తామని సీఎం జగన్​కు భరోసా ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయ వనరులు వచ్చేలా చేస్తామన్నారు. తమకు ముఖ్యమంత్రిపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. రెండ్రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని సీఎం చెప్పారని..,మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.

"పీఆర్సీ, ఇతర సమస్యలపై సీఎంతో చర్చలు జరిపాం. 11వ పీఆర్సీపై రెండున్నరేళ్లు 200 సంఘాలతో చర్చలు జరిపారు. పీఆర్సీ నివేదికలో శాస్త్రీయ అంశాలు పొందుపర్చారు. అధికారుల కమిటీ నివేదికను వారంలో తయారు చేశారు. పీఆర్సీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని కోరాం. అధికారుల కమిటీకి అశుతోష్‌ మిశ్ర నివేదికకు 4 అంశాల్లో తేడాలు. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పింఛనర్ల విషయంలో తేడాలు ఉన్నాయి. ఉద్యోగులు, టీచర్లు, పింఛనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఫిట్‌మెంట్‌పై అధికారుల కమిటీ నివేదికతో నష్టపోతాం. ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఖరారు చేయాలని కోరాం. హెచ్‌ఆర్‌ఏకు సంబంధించి అసంబద్ధంగా ప్రతిపాదించారు. పీఆర్సీ కమిషనర్‌ సిఫార్సు మేరకు హెచ్‌ఆర్‌ఏ ఉంచాలి" - బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ ఛైర్మన్

ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని.. సీఎం​ను కోరాం

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భిన్నాభిప్రాయం

ముఖ్యమంత్రి జగన్​తో జరిగిన భేటీలో కొన్ని ఉద్యోగ సంఘాలు 27 శాతం తగ్గకుండా ఫిట్‌మెంట్ కోరాయని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మరికొన్ని సంఘాలు 34 శాతం ఫిట్‌మెంట్ కోరాయన్నారు. ఉద్యోగ నేతలను సీఎం పిలిచి పీఆర్సీ ప్రకటిస్తారనే నమ్మకం ఉందని చంద్రశేఖరరెడ్డి తెలిపారు.

"కొన్ని సంఘాలు 27 శాతం తగ్గకుండా ఫిట్‌మెంట్ కోరాయి. కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్‌మెంట్ కోరాయి. పాత హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని కోరారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరారు. 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరారు. పీఆర్సీపై 2, 3 రోజుల్లో నిర్ణయిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగ నేతలను సీఎం పిలిచి పీఆర్సీ ప్రకటిస్తారనే నమ్మకం ఉంది."- చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ సలహాదారు

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి: సీఎం జగన్‌

CM Jagan On PRC:పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని.. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని.. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని చెప్పారు.

"ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నా. అన్ని సమస్యలూ సరిదిద్దేందుకు చర్యలు చేపడతాం. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తా. మంచి చేయాలన్న తపనతో ఉన్నాం." - సీఎం జగన్‌

ఇదీ చదవండి :

CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్‌

Last Updated : Jan 6, 2022, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details