సేవ్ అమరావతి , సేవ్ ఫార్మర్స్ అనే నినాదంతో గత 32 రోజులుగా రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలకు దుబాయ్ ప్రవాసాంధ్రులు మద్దతు తెలిపారు. వేవ్ రిజొనెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు రావెళ్ల రమేష్ బాబు, గీతా రమేష్ సమన్వయంతో దుబాయ్‌లోని స్థానిక ఏఎల్ త్వార్ పార్కులో సమావేశమయ్యారు. ఇది కేవలం రెండు జిల్లాల సమస్య కాదని.. రైతుల సమస్య మాత్రమే కాదని.. ఆంధ్రుల అస్తిత్వానికి వచ్చిన ముప్పు అని అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందినవారితో పాటు పలువురు తెలంగాణ ఎన్ఆర్ఐలు కూడా అమరావతికి సంఘీభావాన్ని ప్రకటించారు.
అమరావతికి మద్దతుగా దుబాయ్‌లో గళమెత్తిన ప్రవాసాంధ్రులు - latest news for amaravathi in dhubai
అమరావతికి మద్దతుగా దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు గళం వినిపించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు.
అమరావతికి మద్దతుగా దుబాయిలోని ప్రవాసాంధ్రుల గళం..