మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని.. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆయన పరితపించారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు చేయటం ఎవరికీ సాధ్యం కాదన్న చంద్రబాబు..ఎన్టీఆర్ తన పాత్రలతో ప్రజలను ప్రభావితం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ఎక్కడున్నా అమరావతిని చూసి ఆనందపడేలా శ్రీకారం చుట్టామని.. అలాంటి అమరావతి నేడు కష్టాల్లో ఉందని పేర్కొన్నారు. అందరూ తప్పని చెబుతున్నా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి' ప్రతి ఒక్కరి నినాదం కావాలని అన్నారు. సంపద సృష్టించే కేంద్రంగా అమరావతిని తాము తీర్చిదిద్దగా.. ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు.
'సేవ్ అమరావతి ప్రతి ఒక్కరి నినాదం కావాలి' - సేవ్ ఆంధ్రప్రదేశ్
మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఎక్కడున్నా అమరావతిని చూసి ఆనందపడేలా శ్రీకారం చుట్టామని.. అలాంటి అమరావతి నేడు కష్టాల్లో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.