ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పత్రికాస్వేచ్ఛను హరించే జీవో 2430ను రద్దు చేయాలి: దేవినేని - పత్రికాస్వేచ్ఛ దినోత్సవం

పాత్రికేయులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2430 జీవో పత్రికాస్వేచ్ఛకి సంకెళ్లువేసేలా ఉందన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

devineni uma wishes to journalists on world press freedom day
దేవినేని ఉమ

By

Published : May 3, 2020, 7:34 PM IST

దేవినేని ఉమ ట్వీట్
దేవినేని ఉమ ట్వీట్

పాత్రికేయులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్​గా ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల త్యాగం వెలకట్టలేనిదన్నారు.

ప్రమాదకర వైరస్ అని తెలిసినా వృత్తిని దైవంగా భావించి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వారు అందించే సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2430 జీవో పత్రికాస్వేచ్ఛకి సంకెళ్లువేస్తోందన్నారు. ఆ జీవో రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాత్రికేయులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details