విజయవాడ నగర శివారులో కట్టి ఉన్న గృహాలను పేదలకు ఇవ్వకుండా రాజధాని ప్రాంతంలో ఫ్లాట్లు కేటాయిస్తామని చెప్పటం పేదలను మభ్యపెట్టడమే అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలోని షాబాద్, జక్కంపూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. విశాఖ నుంచి ప్రభుత్వం చంద్రబాబును ఒక్కరినే పంపలేదని.. ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడుల్ని తరిమేసిందని విమర్శించారు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు.
'ఇళ్ల స్థలాల పేరుతో పేదలను రోడ్డున పడేస్తున్నారు' - వైకాపా ప్రభుత్వం ఇళ్లస్థలాల పంపిణీపై దేవినేని ఉమ వ్యాఖ్యలు
సంక్రాంతికి ఇసుక లేకుండా చేసి పేదలను ఇబ్బందులు పెట్టిన జగన్ ప్రభుత్వం.. ఉగాదికి భూములు లాక్కుని పేదరైతులను మరింత బాధ పెడుతోందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటూ.. ఇంటిస్థలాల పేరుతో బడుగు వర్గాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు.
దేవినేని ఉమామహేశ్వరరావు