ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2020, 5:43 PM IST

ETV Bharat / city

జల సంరక్షణ పనులు ఎందుకు పక్కన పెట్టారు?: దేవినేని ఉమా

వైకాపా ప్రభుత్వం జలసంరక్షణ పనులు ఎందుకు పక్కన పెట్టిందో సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సెంటు భూమి పథకంలో వైకాపా నేతలు వాటాలు పంచుకుని మరీ పెద్దఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతికి చర్యలే తప్ప.. అభివృద్ధిపై దృష్టిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

devineni uma on water reserve works of ysrcp goevrnment
జలసంరక్షణ పనులపై దేవినేని ఉమా

వైకాపా ప్రభుత్వం 14 నెలలుగా జలసంరక్షణ పనులను పక్కన పెట్టిందని మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తెలుగుదేశం హయాంలో కె.ఎల్.రావు జయంతిని రైతుల వేడుకలా ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. కె.ఎల్.రావు కల అయిన నదుల అనుసంధానాన్ని చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకున్నారని వెల్లడించారు. ఈ ఏడాది కూడా పది టీఎంసీల గోదావరి నీరు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వెళ్లాయని దేవినేని ఉమా తెలిపారు.

చంద్రబాబు దూరదృష్టితో జలసంరక్షణ చర్యలు చేపట్టడం వల్ల 7లక్షల పై చిలుకు ఆయకట్టు అభివృద్ధి చెందిందని దేవినేని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చొరవ వల్లే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు లభించాయని ఉమా తెలిపారు. జలసంరక్షణ పనుల్ని ఎందుకు పక్కన పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,432 కరోనా కేసులు.. 44 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details