ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dharmana: ఆ తప్పులు పునరావృతం కావద్దనే ఈ నిర్ణయం: ధర్మాన

deputy chief minister: రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో ఆదివారం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

deputy chief minister dharmana visits  indoor stadium works in narasannapeta
ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన

By

Published : Mar 6, 2022, 1:57 PM IST

మూడు రాజధానుల నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్​

Dharmana Krishnadas : రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు మూడు రాజధానులు అవసరమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో ఆదివారం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేసిన జంట నగరాలు మనకు కాకుండా పోయాయని అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాయలసీమ, కోస్తాంధ్ర వంటి ఉద్యమాలు వస్తే రాజధాని సమస్య తలెత్తకుండా మూడు రాజధానులు ఏర్పాటు అవసరమన్నారు.

"జిల్లాల వికేంద్రీకరణ కేవలం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం. 60 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిన జంట నగరాలు(సికింద్రాబాద్​, హైద్రాబాద్​) రాష్ట్ర విభజన తర్వాత మనకు కాకుండా పోయాయి. మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. భవిష్యత్తులో రాయలసీమ, కోస్తా ఆంధ్ర వంటి ఉద్యమాలు వస్తే రాజధాని సమస్య తలెత్తకుండా మూడు రాజధానులు ఏర్పాటు అవసరం. -ధర్మాన కృష్ణదాస్​ , ఉపముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details