ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తప్పుడు నివేదికతో 5 కోట్ల ప్రజల భవితవ్యాన్ని నిర్ణయిస్తారా?' - నిమ్మల రామానాయుడు తాజా వార్తలు

బోస్టన్ కమిటీ నివేదిక తప్పుడు నివేదిక అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. అలాంటి నివేదికపై ఆధారపడి 5 కోట్ల ప్రజల భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

By

Published : Jan 20, 2020, 5:22 PM IST

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

బోస్టన్ కమిటీకి చట్టబద్ధత లేదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అలాంటి కమిటీ నివేదికపై ఆధారపడి 5 కోట్ల ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. బోస్టన్ నివేదిక తప్పుడు నివేదిక అని విమర్శించారు. అమరావతి ఒకే సామాజిక వర్గానికి ఉపయోగపడుతుందనడం సరైంది కాదన్నారు. అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాల్లో 75 శాతం మంది ప్రజలు అణగారిన వర్గాలని వ్యాఖ్యానించారు. గత 7-8 నెలలుగా ఇన్​సైడర్​ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారే తప్ప...చర్యలు తీసుకోలేదని కేవలం మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details